Sundeep Kishan: సందీప్ కిషన్‌కు మేకర్స్ బర్త్ డే సర్ ప్రైజ్..ఈ సారైనా సక్సెస్ వచ్చేనా?

-

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్..తెలుగు,తమిళ భాషల్లో చిత్రాలు చేస్తూనే ఉన్నారు. తమిళ్ లో ‘మాయావన్’ ఫిల్మ్ మంచి సక్సెస్ అయింది. కానీ, తెలుగులో మాత్రం ఏ సినిమా కూడా సరైన స్థాయిలో సూపర్ హిట్ కాలేదని సినీ పరిశీలకులు చెప్తుంటారు. అయితే, సందీప్ కిషన్ మాత్రం వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు.

సందీప్ కిషన్ గత చిత్రాలు అన్నీ కూడా వరుసగా ప్రేక్షకులను నిరాశపరిచాయనే చెప్పొచ్చు. ‘A1 ఎక్స్ ప్రెస్, గల్లీ రౌడీ’ సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, నెక్స్ట్ ఫిల్మ్స్ అయినా హిట్ కావాలని అనుకుంటున్నారట యంగ్ హీరో. ఈ క్రమంలోనే శనివారం సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు.

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రాల పోస్టర్స్ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఆ రెండు చిత్రాల పోస్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వీఐఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పేరు ‘ఊరు పేరు భైరవ కోన’ పోస్టర్ రివీల్ చేశారు.

రంజిత్ జయకోడి దర్శకత్వంలో ‘మైఖేల్’ అనే సినిమా చేస్తుండగా, ఈ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా, ఈ రెండు చిత్రాల్లో ఏదేని ఒకటి అయినా అనుకున్న స్థాయిలో సక్సెస్ కావాలని సినీ ప్రేక్షకులు కోరుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news