కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తుపై జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఏ హోదలో డిక్లరేషన్ ఇచ్చారు..ఆ డిక్లరేషన్ దేశనికా, రాష్ట్రానికా, కాంగ్రెస్ పార్టీ విధానమా అని నిలదీశారు. ఎవరో రాసి ఇస్తే బూతులు మాట్లాడకుండా రాహుల్ ప్రసంగించారని… అభివృద్ధి అంతా టిఆర్ఎస్ పార్టీ హాయాంలోనే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఛత్తీస్ ఘడ్ నుండి వచ్చి ధాన్యం తెలంగాణలో అమ్ముకుని వెళ్తున్నారు..తెలంగాణలో అభివృద్ధి చూడాలి అనుకుంటే విమానాలలో రాత్రి, పగలు ప్రధాని, విపక్ష నేతలు వస్తే చూపిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు మాకు అవసరంలేదు… రైతులను అన్ని రంగాలలో అన్ని విధాలుగా నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు నడిపిస్తే నడిచే పార్టీ టిఆర్ఎస్ కార్ టిఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజలే మాకు దిశా నిర్దేశకులు అని… బీజేపీతో గాని కాంగ్రెస్తోగాని పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం టిఆర్ఎస్ పార్టీకి లేదని నిప్పులు చెరిగారు.