మలబార్‌ చింత.. దీంతో బరువు ఈజీగా తగ్గొచ్చుట..

-

మనకు చింతపండు అంటే చింతచెట్ల నుంచి వచ్చేచింతపండు గురించే తెలుసు..కేరళలో ప్రాంతంలో విరివిగా లభించే మలబార్ చింత చెట్టు నుండి కాసే కాయల ద్వారా ఈ చింత పండును తీస్తారు. ఆరోగ్య పరంగా ఈ చింత పండు అనేక ప్రయోజనాలు ఉన్నాయట.. పూర్వకాలం నుండి దీనిని సాంప్రదాయ వంటకాలలో పులుపుదనం కోసం అక్కడి ప్రజలు వాడుతున్నారు..దీనిలో అనేక ఔషదగుణాలు కలిగి ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతుంది. అస్సాంతో పాటు థాయిలాండ్, మలేషియా, బర్మా ఇతర ఆగ్నేయాసియా దేశాలలో కూడా వాడతారట.. మరీ ఈ చింతపండు వల్ల ఏం లాభాలు ఉన్నాయో చూద్దామా..!

మలబార్ చింతపండు ఒక చిన్న గుమ్మడికాయలా కనిపిస్తుంది. దాని రంగు తొలుత ఆకుపచ్చగా ఉండి పసుపుకు మారుతుంది. ఈ పండు ఆగ్నేయాసియా, తీరప్రాంత కర్ణాటక కేరళలో బాగా ప్రసిద్ధి చెందింది. 2012లో అమెరికన్ సెలబ్రిటీ డాక్టర్ డా. ఓజ్ సహజంగా బరువు తగ్గడానికి పండు నుండి సారాన్ని ఉపయోగించింది.. అప్పుడు ఈ పండు ప్రయోజనాలు వెలుగులోకి వచ్చాయి..

ఉపయోగాలు..

శక్తిని పెంచడం, శరీరం యొక్క నిర్విషీకరణ హృదయ, జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
బరువు తగ్గించే హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ అనే ​​ఫైటోకెమికల్ ఉనికిని కలిగి ఉంది.
ఫైటోకెమికల్ కొవ్వును కాల్చే ఆకలిని అణిచివేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
శరీరంలో కొవ్వును తయారు చేయడానికి ఉపయోగించే సిట్రేట్ లైసేస్ అనే ఎంజైమ్‌ను నిరోధించడం ద్వారా HCA పనిచేస్తుంది.
ఇది మెదడులో సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలను పెంచుతుంది, ఇది తక్కువ ఆకలిని కలిగిస్తుంది.
మలబార్ చింత బరువు తగ్గడంలో దాని పాత్రను నిర్ధారించడానికి మరింత పరిశోధన అధ్యయనం అవసరమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు త్వరగా కరిగిపోయ్యేలా చేయడంలో ఈ మలబార్ చింతపండు ఉపయోగపడుతుంది.
కొవ్వు కణాల్లో పేరుకుపోకుండా చేసే గుణం కూడా ఈ మలబార్ చింతపండుకు ఉంది.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, జీర్ణ వ్యవస్థ చురుకుగా పని చేసేలా చేయడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ మలబార్ చింతపండు ఎంతో సహాయపడుతుంది.
అలాగే దీనిలో యాంటీ ఇన్ ప్లామేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయి. అధిక బరువు సమస్యతో బాధపడే వారు వాడుకోవడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ చింత మనకు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంది. కావాలి అనుకుంటే.. విక్రయించవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version