పుష్ప 2 లో ఆ బాలీవుడ్ బ్యూటీ ఐటమ్ సాంగ్ ?

-

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా పుష్ప . నిజానికి బాలీవుడ్లో ప్రమోషన్స్ చేయకుండానే సినిమా విడుదల చేసి రూ. 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ ఫేమ్ దేశవ్యాప్తంగా పాకిపోయిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా చేయకపోయినా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాను చాలా గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.

అయితే.. పుష్ప 2 సినిమాలో కూడా ఐటెం సాంగ్‌ కూడా ఉండనుందట. అయితే.. ఈ సారి సమంతను కాకుండా.. బాలీవుడ్‌ హీరోయిన్‌ ను బరిలోకి దించేందుకు సుకుమార్‌ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ ఐటెం సాంగ్‌ కోసం మలైకా అరోరాను సుకుమార్‌ సంప్రదించారట. దీనికి ఈ హాట్‌ బ్యూటీ కూడా రెడీ అని తెలిపిందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news