కేటీఆర్ సీఎం కావాలని బీఆర్ఎస్ నేత కుర్చీల పంపిణీ

-

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ వరంగల్ నగరంలో ఓ బీఆర్ఎస్ నాయకుడు వినూత్న ప్రచారానికి తెరలేపారు. కేటీఆర్ సీఎం కేసీఆర్ కుర్చీలో కూర్చోవాలని కోరుకుంటూ బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి పేదలకు 200కుర్చీలు పంపిణీ చేశారు. వరంగల్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో… ఉచితంగా వస్తున్న కుర్చీలు తీసుకోవడానికి ప్రజలు బారులు కట్టారు.

 

గతంలో దసరా పండగను పురస్కరించుకొని రాజనాల శ్రీహరి… హమాలీ కార్మికులకు కోళ్లను పంపిణీ చేశారు. శీతాకాలం ఆరంభంలో కొంతమంది యాచకులకు దుప్పట్లు అందజేశారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా చిన్నారులకు గాలిపటాలు ఇప్పిస్తానని తెలిపారు. శ్రీహరి చేస్తున్న కార్యక్రమాలను చూసి… నగరవాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news