కంటి వెలుగు పథకంలో కేసీఆర్‌ కీలక నిర్ణయం..ఆ కార్డు ఉంటేనే అర్హులు !

-

కంటి వెలుగు పథకంలో కేసీఆర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘కంటివెలుగు’ కార్యక్రమంలో పరీక్షలు చేయించుకునే రోగులు కచ్చితంగా ఆధార్ కార్డును వెంట తేవాలని, దీనిపై విస్తృత ప్రచారం నిర్వహించాలని వైద్యరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

ఖమ్మం వేదికగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఈనెల 18న మధ్యాహ్నం ఒంటిగంటకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన వెంటనే అన్ని జిల్లాల్లో కంటి పరీక్షలు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వివరాలతో కూడిన ఫ్లెక్సీలు, బోర్డులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news