సినిమాలు శాశ్వతం కాదు..చదువే జీవితం అంటున్న ముంబై బ్యూటీ

-

సినిమాల కంటే చదువుకున్న ప్రియారిటీ పై ఓ ముద్దుగుమ్మ లెక్చర్లు దంచుతుంది. డాక్టర్‌ కాబోయి.. యాక్టర్‌ అయ్యామంటారు. యాక్టర్‌ అయిన డాక్టర్స్ కూడా వున్నారు. అప్‌కమింగ్‌ హీరోయిన్‌ మాళవిక శర్మ మాత్రం లాయర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలు లేకపోతే.. లాయర్‌గా సెటిలవుతానంటోంది ఈ అమ్మడు…

శ్రీదేవి తన కూతురు జాన్వి కపూర్‌ చదువు పూర్తయిన తర్వాతే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది. పక్కా ప్లాన్‌తో దూసుకుపోతోంది. ఇక రీల్‌ లైఫ్‌లో కాదు.. రియల్‌ లైఫ్‌లో మాళవిక శర్మ అడ్వకేట్‌. ముంబాయ్‌లో పుట్టి అక్కడే రాజ్వీ లా కాలేజ్‌లో ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తి చేసిన ఈ అమ్మడు.. మోడల్‌గా ఎంట్రీ ఇచ్చింది. నేల టిక్కెట్‌ మూవీతో వెండితెరకు పరిచయమైంది మాళవిక. హీరోయిన్‌ అవతారం ఎత్తిన లాయరమ్మ ‘మహారాష్ట్ర అండ్‌ గోవా బార్‌ కౌన్సిల్’లో మెంబర్‌ అయింది.

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించి అడ్వకేట్‌గా ఐడీ కార్డుని పోస్ట్‌ చేసింది. ‘ధైర్యం వుంటే మన కలలు నిజమవుతాయి’ అని చెప్పుకొచ్చింది. మాళవిక డెబ్యూ మూవీ నేల టిక్కెట్‌ రిలీజై మూడేళ్లు అవుతోంది. ఏడాది క్రితం రామ్‌ సరసన రెడ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాక ఇంతవరకు మరో ఆఫర్‌ దక్కలేదు. కెరీర్‌ అంతంతమాత్రంగానే సాగుతోంది. రెడ్‌ హిట్‌ అయితే.. ఆఫర్స్‌ వస్తాయన్న ఆశతో వుంది. ఒకవేళ కెరీర్‌ డల్‌ అయినా… లాయర్‌గా సెటిలవ్వాలనుకుంటోంది ఈ ముంబై బ్యూటీ.

Read more RELATED
Recommended to you

Latest news