ఏపీలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది- సజ్జల రామక్రిష్టా రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్టారెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశం మొత్తాన్ని విద్యుత్ సంక్షోభం భయపెడుతోంది. ఇటీవల విద్యుత్, బొగ్గు సంక్షోభంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. ప్రస్తుతం సజ్జల కూడా భవిష్యత్ సంక్షోభం గురించి మాట్లాడారు. భవిష్యత్తులో ఏపీలో కరెంట్ కొరత రావచ్చని సజ్జల తెలిపారు. అంతర్జాతీయంగా, దేశీయంగా బొగ్గు కొరత ఉండటంతో కరెంట్ కష్టాలు తప్పకపోవచ్చని అన్నారు. మరోవైపు రేట్లు పెరగడంతో కూడా సమస్య వచ్చిందన్నారు. 

డబ్బు పెట్టినా సమస్య తీరే పరిస్థితి లేదని వెల్లడించారు. ఇంట్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు సజ్జల. రాత్రి 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంట్ కోతలు రావచ్చని తెలిపారు. ఇటీవల కేంద్రమంత్రి భారత్ లో విద్యుత్ సంక్షోభం కలిగే అవకాశం లేదని తేలిపారు. అయితే సజ్జల కేంద్రమంత్రి వ్యాఖ్యలను ఖండించారు. కేంద్రమంత్రి చెప్పిన మాటల్లో వాస్తవం లేదని సజ్జల అన్నారు. ఇప్పటికే సమస్యను సీఎం ప్రధాని ద్రుష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు.