చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు అనారోగ్యం కారణంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఆయన చేసింది నాలుగే సినిమాలు అయినా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయనే అశోకన్ జన్మతః రామన్ అశోక్ కుమార్ అయిన ఆయన మలయాళ ఇండస్ట్రీలో మాత్రం అశోకన్ గుర్తింపు తెచ్చుకున్నారు. 1980లో దర్శకుడు శశి కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన అశోకన్, మలయాళం లో వచ్చిన సైకలాజికల్ డ్రామా వర్ణం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. దర్శకుడు తాహాతో కలిసి రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు.