షాకింగ్.. ఆడ ఏనుగుపై లైంగిక దాడి చేసి చంపేసిన మగ ఏనుగు..!

మరి ఓ మృగమే లైంగిక దాడికి పాల్పడితే. అప్పుడు ఆ మృగాన్ని ఏమనాలి. నిజంగా మృగాలు లైంగిక దాడి చేస్తాయా? ఇప్పటి వరకు అలాంటి ఘటనైతే జరగలేదు కదా. కానీ.. ఒక ఘటన జరిగింది.

మనుషుల్లో మగాళ్లు ఎవరైనా ఆడవాళ్లపై లైంగిక దాడికి పాల్పడితే.. వాడు మనిషి కాదు.. మగాడు కాదు మృగాడు అంటారు. అంటే వాడిని మృగంతో పోల్చుతారు. మానవ మృగం అంటారు.

మరి ఓ మృగమే లైంగిక దాడికి పాల్పడితే. అప్పుడు ఆ మృగాన్ని ఏమనాలి. నిజంగా మృగాలు లైంగిక దాడి చేస్తాయా? ఇప్పటి వరకు అలాంటి ఘటనైతే జరగలేదు కదా. కానీ.. ఒక ఘటన జరిగింది.

ఓ మగ ఏనుగు.. ఆడ ఏనుగుపై లైంగిక దాడికి పాల్పడింది. అంతే కాదు.. దాన్ని చంపేసింది కూడా. షాకింగ్ గా ఉంది కదా. కానీ.. అది నిజం. ముమ్మాటికీ నిజం. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు అడవుల్లో చోటు చేసుకున్నది.

మండిపెంట అటవీ బీట్ పరిధిలో ఓ ఏనుగు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు… అధికారులకు సమాచారం అందించారు. వెంటనే దాన్ని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు.. ఏదైనా అనారోగ్యంతో అది మరణించి ఉండొచ్చని భావించారు.

కానీ.. డాక్టర్లు దానికి పోస్టు మార్టం చేయగా… అది లైంగిక దాడికి గురై చనిపోయినట్టు తేల్చారు. అది ఆడ ఏనుగని… దానిపై మగ ఏనుగు లైంగిక దాడికి పాల్పడిందని… అందుకే అది చనిపోయిందని డాక్టర్లు తెలిపారు.