మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి హల్చల్ చేస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా హుషారుగా ఓటర్లను తన వాళ్లుగా దగ్గరికి తీసుకుంటూ మంత్రి మల్లారెడ్డి ప్రజలలో జోష్ నింపుతున్నారు. ఇక మంత్రి మల్లారెడ్డి ప్రచారం చేస్తున్న మేడ్చల్ నియోజకవర్గం విశేషాలు ఏమిటో? అక్కడ ట్రెండ్ ఏ విధంగా నడుస్తుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందన్నారు. మాయమాటలు చెబితే ఆగం కావొద్దని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని సూచించారు. పదేళ్లలో తెలంగాణలో ఊహించని అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల వారు మన వద్ద జరిగిన అభివృద్ధిని చూసి నేర్చుకునే విధంగా కేసీఆర్ పని చేశారన్నారు. తండాలను, పల్లెలను సీఎం కేసీఆర్ పంచాయతీలుగా మార్చారని, దీంతో అవి అభివృద్ధి పథంలో సాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్లకు పైగా పాలించి ప్రజలను వంచించి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే, మరో అయిదేళ్లు ప్రజలకు సేవ చేస్తానన్నారు. తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మేడ్చల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు.