కాంగ్రెస్ కు ప్రధాని పీఠంపై ఆశ లేదు: మల్లిఖార్జున ఖర్గే

-

నిన్న ఈ రోజు కర్ణాటకలోని బెంగుళూరు లో మెగా విపక్షాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అనేక విషయాలపై చర్చించిన ముఖ్య నేతలు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని నిలువరించి UPA ను అధికారంలోకి తీసుకురావాలని గట్టి సంకల్పంతో ఉన్నారు. కాగా ఈ భేటీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవిపై ఇసుమంత కూడా ఆశ లేదని క్లారిటీ గా చెప్పారు. ఈ విషయాన్ని గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియచేసిందని కూడా ఖర్గే ఈ సందర్భంగా చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ సారి ఎన్డీఏ కూటమిని ఓడించి అధికారంలోకి రావడమే మన అందరి ప్రధాన లక్ష్యం అని గుర్తు చేసారు ఖర్గే. ఈ దేశంలో ప్రస్తుతం ఆపదలో ఉన్న రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని, సామజిక న్యాయాన్ని కాపాడడం కోసమే మనకు అధికారం అవసరం అని చెప్పారు.

ఇంకా సిబిఐ, ఈడీ, సీఐడీ లాంటి దర్యాప్తు సంస్థలను విపక్షాలపై దాడులకు ఉపయోగించకుండా వారి పనిని సక్రమంగా చేయనిచ్చేలా చేయడమే మన లక్ష్యం అన్నారు ఖర్గే.

Read more RELATED
Recommended to you

Latest news