పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలను అన్నిపార్టీలు చాల సీరియస్ గా తీసుకున్నాయి. మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని సీఎం మమతా బెనర్జీ అనేక తంటాలు పడుతుంటే ఒక్క ఛాన్స్ అంటూ ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఎన్నికలకు ఒక్కరోజు ముందు బెంగాల్‌లోని ఓ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాంబు పేలుడు కలకలం సృష్టించగా.. ఇవాళ ఎన్నికలు జరుగుతోన్న సమయంలో.. బీజేపీ నేత ఒకరు.. సీఎం మమతా బెనర్జీ కాల్ లీక్ చేసి షాక్ ఇచ్చారు. మమతా బెనర్జీ.. నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
టీఎంసీ మాజీ నేత.. ప్రస్తుత బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారికి నందిగ్రామ్ కంచుకోట కావడంతో ఈ అంశాన్ని రెండు పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. నందిగ్రామ్‌లో సుబేందు అధికారికి అత్యంత సన్నిహితుడు, తమ్లుక్ ప్రాంత మాజీ టీఎంసీ నేత, ప్రస్తుత బీజేపీ నేత అయిన ప్రలయ్ పాల్.. ఓ ఆడియో రిలీజ చేశారు. ఈ ఉదయం మమతా బెనర్జీ తనకు ఫోన్ చేశారని.. నందిగ్రామ్‌లోని తనకు ప్రచారం చేయాలని కోరారని ప్రలయ్ పాల్ ఆరోపించారు.. తనను మళ్లీ టీఎంసీలోకి రావాలని కోరారరని.. నందిగ్రామ్‌లో సుబేందు అధికారికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని దీదీ కోరినట్లు చెప్పుకొచ్చాడు..