పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం దుర్గాపూర్ లో హెలికాప్టర్ ఎక్కి సీట్లో కూర్చోబోతుండగా జారి పడిపోయారు. ఈ ఘటనలో ముఖ్యమంత్రి మమత బెనర్జీ కి స్వల్ప గాయం అయింది. పూర్తిగా కింద పడకుండా ఆమెను ఆమె భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్లు సమాచారం. స్వల్ప గాయమే కావడంతో, ప్రథమ చికిత్స అనంతరం మమత బెనర్జీ ఎన్నికల ప్రచారం కోసం అసన్సోల్ కు తన ప్రయాణాన్ని కొనసాగించారు.
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని మమత బెనర్జీ ప్రయత్నిస్తుంటే.. వెస్ట్ బెంగాల్ బీజేపీ పాగా వేయాలని ప్రయత్నిస్తుంది. ఇటీవలే మమత బెనర్జీ వాకింగ్ చేస్తూ కింద పడిపోవడంతో తలకు గాయమైన విషయం తెలిసిందే. తాజాగా హెలికాప్టర్ నుంచి కింద పడటంతో స్వల్ప గాయం అయింది.