వైసీపీ మేనిఫెస్టో పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ స్పందించారు. వైసీపీది రియాల్టీ మేనిఫెస్టో అని.. చంద్రబాబుది కాపీ పేస్ట్ మేనిఫెస్టో అని ఆయన విమర్శించారు. ప్రజల కష్టాల నుంచి బయట పడేసే మేనిఫెస్టో ఇది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ విధానాలు సంస్కరణల దిశగా వెళ్తున్నాయన్నారు. విశాఖపట్టణం క్యాపిటల్ టౌన్ గా మేనిఫెస్టో లో ప్రకటించడం ఆనందకరమని ఆయన తెలిపారు.
ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు అంతా విశాఖ రాజధాని కావాలనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. విశాఖకు అంతా కనెక్టవిటి ఉందని.. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. చంద్రబాబు ది కాపీ పేస్ట్ మేనిఫెస్టో అని.. టీడీపీ మాదిరి ఏదో హామీ ఇవ్వలేదన్నారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేశామని.. ఇవాళ కూడా అమలు చేయగలిగినవే మేనిఫెస్టోలో పెట్టామన్నారు.