బ్రేకింగ్ : భవానీ పూర్ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ గెలుపు

-

పశ్చిమ బెంగాల్ లోని భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో… ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. భవానిపురం అసెంబ్లీ నియోజకవర్గo లోని తన బీజేపీ ప్రత్యర్థి ప్రియాంక టిబ్రివాల్ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. కౌంటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ఆధిక్యంలో ఉన్న  మమతా బెనర్జీ.. భారీ విజయాన్నే సొంతం చేసుకుంది.

ఏకంగా 58 వేల 839 ఓట్ల మెజారిటీ తో… బిజెపి పార్టీ  అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్ పై మమతా బెనర్జీ గెలుపొందారు. ఇక మమతా బెనర్జీ భవానిపురం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు మొదలు పెట్టారు. అటు ముఖ్య మంత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద టి.ఎం.సి కార్యకర్తల సంబరాలు నిర్వహిస్తు న్నారు. కాగా.. భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం తో సీఎం పదవి చేపట్టడానికి మార్గం సుగమం చేసుకుంది మమతా బెనర్జీ.

Read more RELATED
Recommended to you

Latest news