పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజల కోసం “ఈ రాజకీయ విద్వేషాన్ని ఆపండి” అని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. “నేను మీ పాదాలను తాకడానికి సిద్ధంగా ఉన్నాను” అని కూడా ఆమె సంచలన ప్రకటన చేసారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో యాస్ తుఫాను సమావేశాన్ని ఆమె బహిష్కరించడం పెద్ద రాజకీయ దుమారమే రేపింది.
పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి అలపన్ బండియోపాధ్యాయను శుక్రవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం డిఓపీటి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. శనివారం తన విలేకరుల సమావేశంలో సిఎం బెనర్జీ తన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలపాన్ బండియోపాధ్యాయను రాష్ట్రంలోనే ఉంచాలని దండం పెట్టి కోరారు. 1987 కేడర్ ఐఎఎస్ అధికారి బండియోపాధ్యాయను మే 31 న ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది.