బ్రేకింగ్ : హత్రాస్ రేప్ కేస్ బాధితురాలి తండ్రి దారుణ హత్య

-

ఉత్తర ప్రదేశ్‌… హాథ్రాస్‌ లో దారుణ ఘటన జరిగింది. ఒక రేప్ కేసు నిందితుడు రెచ్చిపోయాడు. లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లొచ్చిన నిందితుడు… బాధితురాలి తండ్రిని కాల్చి చంపాడు. బాధితురాలి తండ్రి పొలం దగ్గర కాల్పులు జరిపాడు. దీంతో బాలిక తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు…పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన మీద సీరియస్ అయిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విచారణకు ఆదేశించారు.


కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  2018 లో ఒక యువతిని వేధించాడు దీంతో బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో అతన్నిఅరెస్ట్ చేశారు. రెండేళ్లు జైలుశిక్ష అనుభవించిన అతడు..ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. సోమవారం నిందితుడి భార్య, అత్త ఇద్దరు ఓ ఆలయానికి వెళ్లారు. అక్కడ మృతుడి ఇద్దరు కూతుళ్లు కూడా ఉండటంతో…ఇరువర్గాల మధ్య వాదన చెలరేగింది. దీంతో రెచ్చిపోయిన హంతకుడు…కాల్పులకు తెగబడ్డారు. 

Read more RELATED
Recommended to you

Latest news