బిజినెస్ ఐడియా: మీరు చిన్న కంపెనీని స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నారా…? అయితే ఇది మీకోసం…!

-

మంచి రాబడి పొందాలని అనుకుంటున్నారా…? అయితే క్రౌడ్ ఫండింగ్ ట్రై చెయ్యండి. దీని కోసం మీరు ఎం చెయ్యాలి అంటే సాధారణంగా మనం బిజినెస్ లాంటివి స్టార్ట్ చెయ్యాలంటే మనం లోన్ లాంటివి తీసుకుంటూ ఉంటాం. కానీ క్రౌడ్ ఫండింగ్ అంటే ప్రస్తుతం ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా తమ కాన్సెప్ట్, లేదా బిజినెస్ మోడల్ కు నిధులు సమకూర్చుకుంటున్నారు. మీరు ఎం చెయ్యాలి అంటే ఒక వెబ్ సైట్, లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మీ కాన్సెప్ట్ ను ప్రెజెంట్ చేయాలి.

మీ కాన్సెప్ట్ పై ఆసక్తి వున్న వాళ్ళు దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు. దీనినే క్రౌడ్ ఫండింగ్ అంటారు. ఇప్పుడు ఇది బాగా ఫేమస్ అయిపోయింది. ఏది ఏమైనా ఇది చాల మంచి పద్ధతే. అలానే ఈ ఫండ్స్ కూడా చిన్న మొత్తంగా ఉంటాయి. రూ. 100 నుంచి రూ.10000 వరకూ మీ ఫండ్ మొత్తాన్ని పెట్టుకునే వీలుంది. అయితే ఎంతైనా పెట్టొచ్చు. కానీ ఇది విరాళం కింద చూస్తారు.

మనం అనుకున్న దానిని పూర్తి చెయ్యడానికి అవసరమయ్యే అంత మొత్తాన్ని దీనితో పొందవచ్చు. అయితే ఇలా చేసే వారిని సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. మీరు ఏమైనా స్టార్ట్ అప్ కంపనీ ని స్టార్ట్ చెయ్యాలన్న లేదంటే ఏదైనా చిన్న కంపెనీని ప్రారంభించాలన్న క్రౌడ్ ఫండింగ్ ని ఎంచుకోవచ్చు. మీరు దీనిని ఆన్ లైన్ లో కూడా చెయ్యొచ్చు. ఉదాహరణకి కిక్స్టార్టర్, ఫండబుల్ వంటివి వున్నాయి. మీ బిజినెస్ ఐడియా, మీ ప్రాజెక్ట్, ప్లాన్ చెప్పి సోషల్ యాక్టివిటీకి ఫండ్ రైజ్ చేయవచ్చు.

ఇది ఇలా ఉండగా ఎవరు మీకు డబ్బులు ఇస్తారు అనే విషయానికి వస్తే… క్రౌడ్ ఫండింగ్ ద్వారా మీకు డబ్బులు వస్తున్నాయంటే విరాళం పంపిన వారికి మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు. మీరు మీ కంపెనీ ప్రాడెక్ట్స్ ను ఇవ్వొచ్చు. దీనినే రివార్డ్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ అంటారు. అయితే ఇలా క్రౌడ్ ఫండింగ్ చేసే వాళ్లందరికీ ఒక సంవత్సరం పాటు ఉచితంగా సర్వీసు ఇస్తే మీ సంస్థ లో పెట్టుబడి పెట్టేందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ గా వుంటారు. ఇలా ప్రొడక్ట్స్ లేదా సర్వీసుని ఇస్తే చాలు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news