సామాజిక మాధ్యమాల ద్వారా మనుషుల మధ్య దూరం తగ్గింది. ఎంతో దూరంలో ఉన్నా కూడా దగ్గరగా అనిపించేలా చేస్తున్నాయి. అలాగే పక్కనున్న వారిని దూరం చేసేలా తయారయింది కూడా. అది పక్కన పెడితే సామజిక మాధ్యమాలు రోజుకో కొత్త ఫీచర్లని అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. పోటీ ప్రపంచంలో వినియోగదారులకి కావాల్సిన అన్నింటినీ తమ దాంట్లో లభ్యమయ్యేలా చేస్తున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ నుండి సరికొత్త ఫీచర్ బయటకి వచ్చింది.
లైవ్ రూమ్స్ పేరుతో లైవ్ బ్రాడ్ కాస్ట్ లో ఒకేసారి నలుగు కలిసి మాట్లాడుకునే విధంగా రూపొందించింది. పాడ్ కాస్ట్, లైవ్ షో, మొదలగు వాటన్నింటికీ ఒకేసారి నలుగురు మాట్లాడే విధంగా ఉంచింది. ఇప్పటివరకు ఈ ఫీచర్ వాట్సాప్ లో సౌలభ్యంలో ఉన్నదన్న విషయం మనకి తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ కూడా ఇదే విధమైన ఫీచర్ ని తీసుకువచ్చి, జామ్ సెషన్లు, ఇంటర్వ్యూలు కూడా ఇక్కడే చేసుకోవచ్చని చెబుతోంది. ఇప్పటి వరకు మీరు ఈ ఈ కొత్త ఫీచర్ ని ప్రయత్నించకపోతే ఒకసరి ట్రై చేసి చూడండి.