దేశ వ్యాప్తంగా రావణ దహన వేడుకలు ఘనంగా జరిగాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కరోనా ప్రభావంతో జనం గుమిగూడకుండ…జాగ్రత్తపడ్డారు పోలీసులు. అయితే జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ లో దసరా వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. దసరా పండుగ సందర్భంగా బీట్ బజార్ వద్ద మహిషాసురుని బొమ్మను దగ్ధం చేసే విషయంలో ఇరువర్గాల మధ్య చిన్న విషయంలో వాగ్వాదం చెలరేగింది.
ఈ వాగ్వాదంలో యశ్వంత్ అనే భవాని మాల వేసుకున్న యువకుడు రావణుడి దిష్టిబొమ్మ మీద పై పెట్రోలు పోస్తుండగా మరో వైపు నుంచి గుర్తు తెలియని వ్యక్తి మంటని విసరడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో రావణుడి దిష్టిబొమ్మతో పాటు యశ్వంత్ అనే యువకుడికి సైతం మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన స్థానికులు యశ్వంత్ ను కాపాడి ఆస్పత్రికి తరలించారు.