తన అంత్యక్రియలకు తానే విరాళం ఇచ్చిన యువ‌కుడు.. ఏం జ‌రిగిందంటే..?

-

జీవితంపై విరక్తి చెందిన ఓ అనాథ యువకుడు త‌న అంత్య‌క్రియ‌ల‌కు తానే విరాళం ఇచ్చి మ‌రీ.. ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితం మీద విరక్తి చెందానని.. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు.. అంటూ ఓ అనాథ యువకుడు సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టాడు. ఆత్మహత్యకు ముందు అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించే ‘సెర్వ్‌ నీడ్‌’ అనే సంస్థ గురించి తెలుసుకొని వారికి రూ. 6 వేలు అందించాడు.

ఇక వివ‌రాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ జిల్లా గాంధీనగర్‌ తండాకు చెందిన బొంతు విజయ్‌(26) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. డిగ్రీ చదివిన విజయ్‌ ఎనిమిదేళ్ళ క్రితం హైదరాబాద్‌కు వచ్చి శ్రీకృష్ణానగర్‌లో గది అద్దెకు తీసుకొని ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. జీవితంపై నిరాశ క‌లిగి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిశ్చ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే తాను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ఉండరని భావించిన సెర్వ్‌ నీడ్‌ అనే సంస్థకు రూ.6 వేల విరాళం ఇచ్చాడు. ఎవరైనా అనాథకు ఈ విరాళంగా అంత్యక్రియలు చేయాలని కోరాడు.

ఇది జ‌రిగిన రెండు రోజుల‌కే అత‌డు బేగంపేట రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే తాను చనిపోయిన 12 గంటల్లోపు పంజగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగాలని తన పెద్దమ్మ కుమారుడైన సందీప్‌కు సమాచారం అందించాలని సూసైడ్‌ నోట్‌ రాశాడు. విజయ్ మరణ వార్త తెలుసుకున్న సెర్వ్‌ నీడ్‌ సంస్థ ప్రతినిధులు గురువారం పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news