పెట్రోల్ రేట్లు పెరిగాయని ప్రయాణికులతో వెళుతున్న బస్సుకు నిప్పంటించాడు..!

పెట్రోల్ రేట్లు పెరిగాయని ఓ యువకుడు ఆర్టిసి బస్సు కు నిప్పంటించాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం పాలమూరు బస్టాండ్ సెంటర్లో చోటుచేసుకుంది. ఏడుకొండలు అనే యువకుడు పామూరు బస్టాండ్ సెంటర్లో కనిగిరి నుండి పామూరు వెళ్లే ఆర్టీసీ బస్సుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

బస్సులో 28 మంది ప్రయాణికులు ఉండగా వారు తీవ్ర ఆందోళన చెందారు. ఇక యువకుడిని బస్సు కు నిప్పు పెట్టడానికి కారణం అడగ్గా వింత వింత సమాధానాలు ఇచ్చాడు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయని త్వరలోనే జనసేన అధికారంలోకి వస్తుందని ఇంధనాల ధరలు తగ్గిస్తుందని నోటికి వచ్చిన సమాధానం చెప్పాడు. దాంతో అతడి మతిస్థిమితం సరిగా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.