నేడే ఐపీఎల్ ఫైనల్… చెన్నైతో తలపడనున్న కోల్ కతా.

-

ఐపీఎల్ 14 వసీజన్ తుది అంకానికి చేరింది. ఐపీఎల్ లో కప్పు కొట్టేది ఎవరనేది తేలబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. దాదాపు 9 సార్లు ఫైనల్ కు చేరి మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై ఒక వైపు.. ఫైనల్ చేరిన ప్రతీసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్ కతా మరోవైపు. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు పోరు నెలకొనబోతోంది. వరసగా రెండు మ్యాచులను గెలిచిన జట్టుగా కోల్ కతా విశ్వాసంతో ఉండగా, లీగ్ లోనే అత్యంత సక్సెస్ అయిన జట్టుగా కోల్ కతా ఉంది. గడిచిన రెండు క్వాలిఫయర్ మ్యాచుల్లో ప్రత్యర్థులను తక్కువ స్కోర్లకే కట్టడి చేసిన కోల్ కతా బౌలింగ్ విభాగంలో పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు చెన్నై జట్టుకు ధోని కెప్టెన్సీ ఎస్సెట్ గా ఉంది. దీనికి తోడు రుతురాజ్ గైక్వాడ్ భీకరఫామ్ లో ఉండటం కలిసి వచ్చే అంశం. చెన్నై జట్టుకు సీనియర్ ఆటగాళ్ల అనుభవం కూడా ప్రధాన సానుకూల అంశంగా చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news