కరోనా లాక్ డౌన్…దానికోసం కుక్కను షాపుకు పంపిన యజమాని!!

35

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో తిండి ప్రియులు నానా తిప్పలు పడాల్సి వస్తుంది. రోడ్లపైకి వస్తే ఎవరి కరోనా ఎవరికీ అంటుతుందో అన్న భయం ఒకటి అయితే పోలీసుల జులం ఎక్కడ చూపిస్తారో అని ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తిండి ప్రియులు తమకు కావాల్సిన ఫుడ్ కోసం పెంపుడు జంతువులను వాడుకుంటున్నారు. ఈ ఘటన మెక్సికో లో చోటుచేసుకుంది. మెక్సికోలో ఆంటోనియో మునోజ్ అనే ఓ తిండిప్రియుడు లాక్ డౌన్ కారణంగా తనకు ఇష్టమైన ఫుడ్ ని తినడానికి కుదరడం లేదు. దీనితో అతగాడు తనకు ఇష్టమైన ‘చీతూస్‘ ను తెచ్చుకోవడానికి తన పెంపుడు జంతువు కుక్కను ఉపయోగించుకున్నాడు. బయటకు వెళ్లడానికి పరిస్థితి లేకపోవడం తో అతగాడు సూపర్ ఐడియాతో కుక్కకు చీతూస్ తెచ్చే పని పురమాయించాడు. తన బుల్లి పెంపుడు కుక్క మెడకు చిట్టీ చుట్టాడు. హలో, షాప్‌కీపర్. నా కుక్కకు చీతోస్ ఇవ్వు. ఎర్రది కాదు, ఆరెంజ్ రంగుది. దాని కాలర్‌కు 20 డాలర్లు ఉన్నాయి, తీసుకో అని రాశాడు. అలానే దారి మధ్యలో ఎవరైనా కుక్కను చూసి ఆరా తీసి డబ్బులు కాజేస్తారనే అనుమానంతో వారందరికీ కూడా ఒక హెచ్చరిక కూడా రాశాడు.

కుక్కను గనుక కదిపితే ఇక అంతే అది కరుస్తుంది అంటూ మరో చీటీ కూడా రాశాడు. ఇక ఆ కుక్క యజమాని ఆర్డర్స్ ను ఫాలో అవుతూ షాపుకు వెళ్లి, యజమాని కోరిన చీతూస్ పొట్లం పట్టుకొచ్చేసింది. అది షాపుకు వెళ్తున్న, తిండిని తిరిగి ఇంటికి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఐడియా బాగానే ఉందిగానీ, ఆ కుక్క దారితప్పి మనకు తెలియని రోగం కూడా ఇంటికి తీసుకురావొచ్చు జాగ్రత్త అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి లాక్ డౌన్ తో ప్రజలు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు.