బకింగ్ హమ్ ప్యాలెస్ ను కూడా తాకిన కరోనా…పిన్స్ చార్లెస్ కు పాజిటివ్!

-

కరోనా మహమ్మారి కి పేద,రాజు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ వైరస్ పలకరిస్తూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి కారణం గా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 20 వేలకు చేరుకోగా,బాధితుల సంఖ్య 4,20,000 లకు చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ కరోనా మహమ్మారి బకింగ్ హమ్ ప్యాలెస్ కు కూడా చేరినట్లు తెలుస్తుంది. ప్రిన్స్ చార్లెస్(71) కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ప్యాలెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రిన్స్ చార్లెస్ భార్య 72 ఏళ్ళ డచెస్ ఆఫ్ కార్న్‌వాల్‌ కామిలాకు కూడా పరీక్షలు నిర్వహించారు. అయితే, ఆమెకు వైరస్ లక్షణాలు ఏమీ లేవని నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. బ్రిటన్ రాణి తన కుమారుడిని మార్చి 12న చివరిసారిగా కలిశారని అయితే ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు ప్యాలెస్ తెలిపింది. ఆరోగ్య సంరక్షణ కోసం రాణి వైద్య సలహాలను పాటిస్తున్నట్లు స్పష్టం చేసింది. క్లారెన్స్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆబర్డీన్‌షైర్‌లోని ఎన్‌హెచ్‌ఎస్ వారికి వైద్య పరీక్షలు నిర్వహించింది అని ప్రస్తుతం చార్లెస్, కామిలా ఇద్దరూ స్కాట్లండ్‌లోని బాల్మోరల్‌లో స్వీయ నిర్బంధంలో ఉన్నారని, యువరాజుకు ఎవరి నుంచి వైరస్ సోకి ఉంటుందన్నది చెప్పలేమని క్లారెన్స్ హౌస్ తెలిపింది.

మరోపక్క ప్రజా పనుల్లో భాగంగా ప్రిన్స్‌ చార్లెస్‌ గత కొన్ని వారాలుగా ఎంతో మందిని కలిసినట్లు తెలుస్తుంది. కావున ఆయన ఎంతో మందిని కలిసినప్పుడు ఈ వైరస్ ప్రిన్స్‌కు సోకి ఉండొచ్చు అని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి కోవిడ్‌-19 వ్యాధితో వేల్స్‌లో ఇప్పటి వరకు 17 మంది చనిపోగా, 478 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news