అసలుకే కరోనా మహమ్మారి….సూపర్ మార్కెట్ లో సామాన్లు నాకుతూ సెల్ఫీ

-

ఒకపక్క అమెరికా లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే ఒక వ్యక్తి చేసిన పనికి జనాలు మరింత హడలి పోతున్నారు. కరోనా తో అల్లాడుతున్న అగ్రరాజ్యంలో ఒక వ్యక్తి సూపర్ మార్కెట్ లోకి ప్రవేశించి ఎలాంటి సామాన్లు కొనలేదు సరికదా అక్కడున్న వస్తువులను నాకుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అయితే అంతటితో ఆగకుండా ఆ వీడియో ను కాస్త సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఆ వీడియో కాస్త వైరల్ గా మారి గురుడు అడ్డంగా బుక్కయ్యాడు. అమెరికాలోని మిస్సోరీ కి చెందిన 26 ఏళ్ల కాడి ఫిస్టర్ అనే వ్యక్తి మార్చి 11 న వాల్ మార్ట్ స్టోర్ కి వెళ్ళాడు. ఈ క్రమంలో అక్కడ సామాన్లను నాకుతూ ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అయితే ఆ వీడియో కాస్త స్నాప్ చాట్ లో వైరల్ గా మారడం తో ఆ వీడియో కాస్త పోలీసులకు చేరింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు అతడిని పట్టుకొని విచారించగా అంతర్జాతీయ మీడియా దృష్టి లో పడేందుకు ఇలా చేశాను అంటూ ఫిస్టర్ వెల్లడించడం విశేషం. అమెరికాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమేనా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 54,941 కేసులు నమోదుకాగా, 784 మంది చనిపోయారు. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమై లాక్‌డౌన్ ను ప్రకటించింది. అయితే, ఫిస్టర్ చేసిన పనికి పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఓ వ్యక్తి వాల్మార్ట్‌ స్టోర్‌లో వస్తువులను నాకుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అతడిని మేం అదుపులోకి తీసుకున్నాం. వార్రెన్ కౌంటీలో కేసు విచారణలో ఉంది. నిందితుడిపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని ప్రకటించారు. అతడిపై క్రిమినల్ కేసుకు బదులు.. తీవ్రవాద నివారణ కేసును నమోదు చేయడం గమనార్హం. అయితే మరోపక్క ఫిస్టర్ వంటి వ్యక్తులు చేస్తున్న చర్యల వల్ల అక్కడ ప్రజల్లో భయం మరింత పెరిగిపోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news