ఇంటర్నేషనల్ కాల్ అటెండ్ చేస్తే.. సెల్‌ పేలి యువకుడికి గాయాలు

-

వాలాజలో సెల్‌ఫోన్‌ పేలి ఎలక్ట్రీషియన్‌కు తీవ్ర గాయాలైన సంఘటన సంచలనం రేపింది. నేతాజీ వీధికి చెందిన వెంకటేశన్‌(32) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో వెంకటేశన్‌ ఇంటిలో ఉన్నాడు. ఈ స‌మయంలో ఓ ఇంటర్నేషనల్ కాల్ రావడంతో ఫోన్‌ ఆన్‌ చేసి మాట్లాడేందుకు ప్రయత్నించగా పెద్ద శబ్దంతో పేలింది. ఈ ప్రమాదంలో వెంకటేశన్‌ తల, చెయ్యి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే వాలాజలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అనంతరం మెరుగైన చికిత్స కోసం వేలూరు అడుక్కంబరైలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఇక కాల్ అటెండ్ చేస్తే, ఫోన్ ఎందుకు పేలుతుందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గాయపడ్డ వెంకటేశన్, పోలీసుల విచారణలో తన ఒంటిపై గాయాలకు పలు రకాల కారణాలు చెప్పినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news