ఆన్​లైన్​లో కేకు ఆర్డర్.. అకౌంట్​ నుంచి 1.20 లక్ష మాయం

-

సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా సైబర్ కేటుగాళ్లను పట్టుకోలేకపోతున్నారు. తాజాగా వరంగల్ నగరంలో ఓ వ్యక్తి ఆన్​లైన్లో కేక్ ఆర్డర్ చేశాడు. అంతే.. క్షణాల్లో అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.1.20 లక్షలు మాయమయ్యాయి.

వరంగల్​ నగరంలోని 27వ డివిజన్‌లో గల రాంకీ విల్లాస్‌లో నివాసముంటున్న తోట అఖిల్‌ తన స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఆన్‌లైన్‌లో కేక్‌ ఆర్డర్‌ చేశారు. ఆర్డర్‌ ధ్రువీకరించుకోవడానికి ఫోన్‌ చేస్తున్నామని, మొబైల్‌ నంబర్‌కు వచ్చిన వన్‌టైం పాస్‌వర్డ్‌ చెప్పాలని అవతలి వ్యక్తి కోరడంతో అఖిల్‌ ఆ నంబర్‌ చెప్పాడు. ఆ వెంటనే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.60 వేలు వేరే ఖాతాకు వెళ్లినట్టు మెసేజ్‌ వచ్చింది. అనిల్‌ అదే నంబర్‌కు ఫోన్‌ చేసి ఖాతాలో నగదు ఎక్కువ మొత్తంలో ట్రాన్స్‌ఫర్‌ అయినట్టు వారికి చెప్పారు.

తిరిగి ఓటీపీ వస్తుందని, అది చెప్తే డబ్బులు తిరిగి ఖాతాలో జమ అవుతాయని సదరు సంస్థ ప్రతినిధి సూచించడంతో మరోసారి ఓటీపీ వివరాలు చెప్పారు. వెంటనే అనిల్‌ ఖాతా నుంచి మరో రూ.60 వేలు బదిలీ అయ్యాయి. మొత్తం రూ.1.20 లక్షలు మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్‌ క్రైం విభాగం ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news