ప్రియురాలు ఆత్మహత్యాయత్నం.. ఐసీయూలో తాళి కట్టిన ప్రియుడు

-

ప్రేమ వివాహాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో అసలు ఊహించలేం. కొన్ని వివాహాలు గుడిలో జరిగితే.. మరికొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో జరుగుతుంటాయి. కానీ పూణేలో ఓ పెళ్లి ఆస్పత్రి ఐసీయూలో జరిగింది. తనను ప్రేమిస్తున్నానని చెప్పి, మోసపూరిత మాటలతో లోబరచుకుని, ఆపై పెళ్లికి నిరాకరిస్తున్నాడన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేయగా, బంధువులు కల్పించుకోవడంతో దిగివచ్చిన ప్రియుడు తాళి కట్టాడు. ఆమె చికిత్స పొందుతున్న ఐసీయూనే పెళ్లి వేదికైంది.

ఈ ఘటన పుణె నగరానికి చెందిన సూరజ్ అనే యువకుడు, ఓ యువతీ ప్రేమించుకున్నారు. ఆపై పెళ్లాడేందుకు సూరజ్ నిరాకరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. విషయాన్ని పసిగట్టిన బంధువులు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. సూరజ్ కు దేహశుద్ధి చేసి, ఆసుపత్రికి తరలించారు. ఆపై ఐసీయూలోనే ఆ జంట ఒకటైంది.

Read more RELATED
Recommended to you

Latest news