జేబులో రూ.3 మాత్రమే ఉన్నా.. రూ.40వేల నగదు బ్యాగు దొరికితే తిరిగిచ్చేశాడు..!

-

నేటి తరుణంలో సమాజంలో నీతి, నిజాయితీలు కనుమరుగయ్యాయి. ఇతరుల సొమ్మును తాకకుండా నీతి, నిజాయితీలతో జీవించే వారు చాలా తక్కువ మందే ఉన్నారు. వారు మనకు ఎక్కడో గానీ కనిపించరు.

నేటి తరుణంలో సమాజంలో నీతి, నిజాయితీలు కనుమరుగయ్యాయి. ఇతరుల సొమ్మును తాకకుండా నీతి, నిజాయితీలతో జీవించే వారు చాలా తక్కువ మందే ఉన్నారు. వారు మనకు ఎక్కడో గానీ కనిపించరు. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా సరిగ్గా అలాంటి ఓ వ్యక్తి గురించే.. ఆ పెద్దాయనకు రోడ్డుపై డబ్బు దొరికితే దాన్ని తీసుకోకుండా ఆ మొత్తాన్ని పోగొట్టుకున్న వ్యక్తికే తిరిగిచ్చేశాడు. దీంతో ఇప్పుడాయనను అందరూ అభినందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే…

man returned bag with rs 40000 cash in it

మహారాష్ట్రలోని సతారా ప్రాంతం పింగళి అనే గ్రామానికి చెందిన ధనాజీ జగ్దలె (54) అనే వ్యక్తి దీపావళి పండుగ సందర్భంగా దహీవాడీ అనే ప్రాంతంలో ఉండే తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి సొంత ఊరుకు ఈ మధ్యే తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో అతను బస్‌స్టాప్ వద్దకు రాగానే అక్కడ రూ.40వేలు ఉన్న ఓ బ్యాగు కనిపించింది. దాన్ని తీసుకుని అక్కడే ఉన్న కొంత మందిని బ్యాగు ఓనర్ కోసం ఎంక్వయిరీ చేశాడు.

అయితే ఆ బ్యాగును పోగొట్టుకున్న వ్యక్తి అక్కడే దాని కోసం వెతుకుతుండగా జగ్దలె దాన్ని అతనికి తీసుకెళ్లి ఇచ్చాడు. దాంతో ఆ వ్యక్తి సంతోషం వ్యక్తం చేస్తూ జగ్దలెకు రూ.1వేయి బహుమతి ఇవ్వబోయాడు. కానీ జగ్దలె వద్దని చెప్పి తన ఊరికి వెళ్లేందుకు రూ.10 బస్ చార్జి అవుతుందని, కానీ తన జేబులో రూ.3 మాత్రమే ఉన్నాయని, తనకు రూ.7 ఇస్తే చాలని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి జగ్దలెకు రూ.7 ఇచ్చాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత బీజేపీ ఎమ్మెల్యే శివేంద్రరాజే భోస్లే, ఎంపీ ఉదయన్‌రాజే భోసే, ఇతర ఎన్‌జీవోలు జగ్దలెకు నగదు బహుమతి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కానీ జగ్దలె దాన్ని తిరస్కరించాడు. అంతేకాదు.. ఇతరుల సొమ్మును తాను తాకనని, తనకు నిజాయితీగా ఉండడం అంటే ఇష్టమని చెబుతున్నాడు. ఎంతైనా.. ఇలాంటి వారు మనకు కనిపించడం చాలా అరుదు కదా.. అవును మరి.. అందుకని ఆయన్ను మనమందరం అభినందించాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news