నిద్ర.. మనిషి తన జీవితంలో సగ భాగాన్ని నిద్రకే కేటాయిస్తాడట. దీన్నిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు. నిద్ర మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో. జీవితంలో సగం సమయం నిద్రకే కేటాయించే మనిషి.. ఆ నిద్రను ఎలా ఆస్వాదిస్తున్నాడు అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
వెనుకటికి మన తాతలు, ముత్తాతలు మాత్రం హ్యాపీగా నిద్రపోయేవారు. ప్రశాంతంగా తమ నిద్రను ఎంజాయ్ చేసేవారు. అది కూడా టైమ్ టు టైమ్. అందుకే వాళ్లు నిండు నూరేళ్లు జీవించారు. ఇప్పుడు నిద్ర కరువు. రాత్రి రెండింటి దాకా మేల్కోవడం.. స్మార్ట్ ఫోన్స్, ఇతరత్రా అడ్డంకులు నేటి యువతను నిద్ర నుంచి దూరం చేస్తున్నది. కొంతమందికి పడుకున్నా నిద్రరాదు. ఇంకొందరికి ఉదయం నాలుగు తర్వాత నిద్ర పడుతుంది. కొంతమందికి నాలుగు దాటితే నిద్ర పట్టదు. ఇలా రకరకాల సమస్యలతో నేటి ప్రజలు నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు.
మరి దీనికి పరిష్కారం. స్లీపింగ్ ట్యాబెట్లా? అస్సలు కాదు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజమైన పద్ధతిలో గుర్రు కొడుతూ.. ఇలా పడుకోగానే అలా నిద్రపట్టేలాగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి.
ముందుగా మీరు మీ కోపాన్ని తగ్గించుకోవాలి. అరే.. మీకు అంత కోపం వస్తుందెందుకు.. నిజం చెబుతున్నాం. మీరు మీ కోపాన్ని ఎంత తగ్గించుకుంటే అంత బాగా నిద్రపోతారు. ఇదేదో మేం చెబుతున్నది కాదు సుమీ.. లండన్ యూనివర్సిటీకి చెందిన ఓ రీసెర్చర్ చెబుతున్న మాటలు ఇవి. కోపంతో ఎవరైతే నిద్రపోతారో.. అది వాళ్ల మెదడు మీద ప్రభావం చూపిస్తుందట. దీంతో లేచిన తర్వాత వాళ్ల మైండ్ సరిగ్గా పనిచేయదు. అంతే ప్రశాంతత కరువు అన్నమాట. మరి.. ఇప్పటి నుంచైనా కోపం తగ్గించుకుంటారా? ఇంకా ఉన్నాయి..
కోపం తగ్గించుకుంటాం సరే.. అయినప్పటికీ నిద్ర రాకపోతే ఏం చేయాలి సామీ అని అంటారా? క్షణాల్లో నిద్రపోవాలంటే మీరు ఈ చిన్న చిట్కాలు పాటించాలి. దీంతో చిటికెలో మీకు నిద్ర వద్దన్నా ముంచుకొస్తుంది.
ముందుగా మీరు చేయాల్సింది ఫోన్ కు దూరంగా ఉండటం… ఫోన్ ను వీలైతే స్విచ్ ఆఫ్ చేయండి లేదంటే సైలెంట్ లో పెట్టండి. ముందు ఆ పని చేయండి. తర్వాత గదిలో తక్కువ టెంపరేచర్ ఉండేలా చూసుకోండి. పడుకోవడానికి ముందు చల్లటి నీటిలో ఓ 30 సెకన్ల పాటు మీ ముఖాన్ని ఉంచండి. కాళ్లకు సాక్సులు వేసుకోండి. కళ్లు మూసుకొని మీకు నచ్చిన వాళ్లను ఓసారి ఊహించుకోండి. అలాగే మెల్లిగా.. ఇంకాస్త మెల్లిగా రిలాక్స్ అవండి. అంతే.. మీకు తెలియకుండానే మీరు నిద్రలోకి జారుకుంటారు. ఎలా ఉన్నాయి చిట్కాలు.. ఇంకెందుకు ఆలస్యం.. ఈరోజు నుంచే ఈ చిట్కాలను పాటించి నిద్రను ఎంజాయ్ చేయండి.