జింక మాంసం అంటూ పిల్లి మాంసం అమ్మాడు… పోలీసులు ఏం చేసారంటే…!

-

కరోనా సమయంలో జనాలు ఇప్పుడు నాన్ వెజ్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నాన్ వెజ్ తో ఇంట్లో ఉండి పార్టీలు చేసుకుంటున్నారు జనాలు. కొంచెం దొరికినా చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు జనాలు. కొంచెం సందు దొరికినా సరే మాంసం దుకాణాల వద్దకు బారులు తీరుతున్నారు. హైదరాబాద్ చెన్నై, కోయంబత్తూర్ వంటి నగరాల్లో ఇప్పుడు మాంసానికి మంచి డిమాండ్ వచ్చింది.

ఉద్యోగస్తులు అందరూ కూడా ఇప్పుడు ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. దీనిని కొందరు వ్యాపారస్తులు ఆసరాగా చేసుకుని ధరలను ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు. ఇది గమనించిన తెలంగాణా సర్కార్ మటన్‌, చికెన్‌ ధరలను నియంత్రించేందుకు ముందుకు వచ్చింది. ఎంత ధరకు అమ్మాలి అనే దాని మీద ధరల పట్టికతో ఒక బోర్డ్ కూడా ఏర్పాటు చేసింది. ఇక ఇదిలా ఉంటే తమిళనాడులో ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. జింక మాంసం తక్కువ ధరకే అంటూ ఒక యువకుడు అమ్ముతున్నాడు.

తక్కువ ధరకే జింక మాంసం వస్తుంది కదా అని చాలా మంది అతని వద్ద మాంసం కొనుగోలు చేసారు. విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో సివిల్ పోలీసులు రంగంలోకి దిగారు. బాబు మీద ఒక కన్నేశారు… అది పిల్లి మాంసం అని గుర్తించి… గౌరవ మర్యాదలతో సార్వాడు ని స్టేషన్ కి తరలించి వాయనాలు, అట్ల తద్ది కార్యక్రమం మొదలుపెట్టారు. బాబుది తిరుపత్తూర్‌ జిల్లా ఆంబూరు సమీపంలోని పెరియాం, పేరు మణికంఠన్…

Read more RELATED
Recommended to you

Latest news