సోఫాలో 30 లక్షలు దొరికినా కక్కుర్తి పడలేదు…!

139

ఈ రోజుల్లో రూపాయి ఉచితంగా వస్తుంది అంటే చాలు ఎగబడిపోతు ఉంటారు జన౦. పని చేయకుండా పావలా వస్తుంది అంటే చాలు పడే కక్కుర్తి అంతా ఇంతా కాదు. కాని ఒక వ్యక్తి పెద్ద మనసు చాటుకున్నాడు. మాత్రం 30 లక్షలను తిరిగి ఇచ్చేసాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. వివరాల్లోకి వెళితే మిచిగాన్‌కు చెందిన హోవార్డ్ కిర్బీ సెకండ్ హ్యాండ్ దుకాణంలో ఓ సోఫాను కొనుగోలు చేసాడు.

సోఫాను కొన్నాళ్ళు బాగానే వాడుకున్నాడు. అయితే అనుకోకుండా కొంత కాలం అనంతరం ఆ సోఫా లోపల అనుకోకుండా హోవార్డ్‌కు డబ్బుల కట్టలు కనపడటంతో కంగు తిన్నాడు. సోఫా లోపల మొత్తంగా 43 వేల డాలర్లు దొరకడంతో హోవార్డ్ నిజమేనా అనుకున్నాడు. మరి సోఫాను హోవార్డ్ కొనుగోలు చేసాడు కాబట్టి ఆ సోఫాలో దొరికిన డబ్బు తనకే చెందుతుంది కాబట్టి, కాని తన సొమ్ము కాదని భావిచిన ఆ వ్యక్తి,

సోఫా కొనుగోలు చేసిన దుకాణం ద్వారా అసలు సోఫా యజమాని అడ్రస్ కనుక్కుని అక్కడకు వెళ్ళగా ఆ సోఫా తన తాతయ్యకు చెందినది అని, ఆయన ఇటీవల అనారోగ్యంతో మరణించాడని కిమ్ ఫాత్ అనే మహిళ అతనికి చెప్పింది. సోఫా పాతది కావడంతో కాల్చేద్దాం అనుకున్నాం అని, సోఫా దుకాణం వాళ్లు తీసుకుంటామనడంతో వాళ్లకు ఇచ్చినట్టు వివరించారు. తన తాత డబ్బు దాచారని తనకు తెలియదని చెప్పగా ఆ డబ్బు ఆ మహిళకు ఇచ్చేసారు.