గుంటూరులో ఒక నీచుడి వ్యవహరం వెలుగులోకి వచ్చింది. ఈ దరిద్రుడు ఈజీ మనీ కోసం కట్టుకున్న భార్య నగ్న వీడియోని ఆన్లైన్ లో పెట్టాడు. ఏకాంతంగా ఆమెతో ఉన్నప్పుడు ఆమెకు అనుమనారం రాకుండా రహస్యంగా రికార్డు చేసి, వాటిని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేయడం ద్వారా డబ్బులు దండుకోవాలని ప్లాన్ చేశాడు. ముందుగా ఆన్లైన్ లో 300 వేసిన బెజవాడ యువకుడికి భార్య నగ్న వీడియో పంపాడు సదరు భర్త. దీంతో భర్త వంశీ రెడ్డిపై దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. MBA పూర్తి చేసిన వంశీరెడ్డి 2017 లో వివాహం చేసుకున్నాడు.
అప్పటి నుండి ఎటువంటి పనీ పాట లేకుండానే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈ విధంగా డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయ్యి శ్రీకాకుళంలో మరో స్నేహితుడికి కూడా భార్య నగ్న ఫోటోలు పంపాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు వంశీ రెడ్డిని, బెజవాడ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తన ఫోన్ లో డేటా పోలీసులు బ్యాకప్ చేస్తే అవకుండా సాఫ్ట్ వెర్ వేసినట్టు గుర్తించారు. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు కీచక భర్త ఆ వీడియోలను వ్యక్తులకే పంపాడా ? లేక ఇతర పోర్న్ సైట్లలో కూడా వేశాడా ? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.