మంచు లక్ష్మీ కూతురు విద్య నిర్వాణ ప్రపంచ రికార్డు..

-

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచులక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమెరికాలో థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగొచ్చాక లక్ష్మీ టాక్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి వంటి సినిమాల్లో మెరిసింది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మంచులక్ష్మీ ఫైర్ బ్రాండ్ అన్న సంగతి అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే మంచు లక్ష్మీ తాజాగా ఓ విషయాన్ని అందరితో పంచుకుంది.

మంచు లక్ష్మీ కూతురు విద్య నిర్వాన ప్రపంచ రికార్డుని క్రియేట్ చేసింది. నోబెల్ బుక్ ఆఫ్ రికార్డులో యంగెస్ట్ చెస్ ట్రైనర్ గా చోటు దక్కించుకుంది. ఆరేళ్ల విద్య నిర్వాణ ఈ రికార్డుని క్రియేట్ చేసింది.ఈ మేరకు అవార్డు ప్రతినిధి సర్టిఫికేట్ అందజేసారు. కూతురు రికార్డు క్రియేట్ చేయడంతో మంచు లక్ష్మీ ఆనందం వ్యక్తం చేసింది. పిల్లలని కేవలం చదువులోనే కాదు ఆటల్లోనూ ఆరితేరేలా చూడాలని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version