కామెంట్: మనోజ్ మాటలు… వీరికి చెంపపెట్లు!

సామాజిక విషయాల్లో ఎగ్రెసివ్ గా స్పందించే మంచు మనోజ్… తాజాగా సింగరేణి కాలనీలో కామాందుడి వికృత చేష్టలకు బలైన పసిబిడ్డ తల్లితండ్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో తన ఆవేదననూ, ఆవేశాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మనోజ్ మాటలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. అంతేకాదు.. మనోజ్ మాటలకు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి!

manchu manoj at singareni

“ఇప్పుడే ఈ బాదిత కుటుంబాన్ని పరామర్శించాను.. వివరాలు అడిగితెలుసుకున్నాను.. నా కాళ్లపై పడి ఆ బిడ్డ తల్లి, ఆవేదన చెందుతుంటే, అచేతనుడినైపోయాను. ఆడపిల్లలను ఎలా గౌరవైంచాలనే విషయం ప్రతీ ఇంటిలో తల్లితండ్రులు, తమ తమ బిడ్డలకు నేర్పాలి. ఇంకా ఆ దుర్మార్గుడు దొరకలేదు.. పోలీసులు వెతుకుతున్నామని చెబుతున్నారు” అంటూ మొదలుపెట్టారు మనోజ్! “ఇలాంటి దుర్మార్గుడిని పట్టుకుని 24గంటల్లో కఠినంగా శిక్షించాలని” పోలీసులను కోరారు. ఇదే సమయంలో మీడియా, సోషల్ మీడియాల్లో ఆ కౄరుడి ఫోటోను షేర్ చేయాలి, ఊరంతా జనాలంతా జల్లెడ పట్టాలి” అని కోరారు.

అనంతరం.. “సాయి ధరం తేజ్ కు ప్రమాధం జరిగితే.. గ్రాఫిక్స్ చేసి మరీ చూపింస్తున్నారు.. అటు పడ్డాడు -ఇటు పడ్డాడని ఎపిసోడ్స్ ఎపీసోడ్స్ టెలీకాస్ట్ చేస్తున్నారు… ఆ దుర్మార్గుడు దొరకడానికి మీడియా సహకరించాలి” అని మనోజ్ తనదైన శైలిలో స్పందించారు!

కామెంట్స్: మనోజ్ స్పందనపై సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్లు పడుతున్నాయి. “ఇప్పటివరకూ ఈ విషయంపై ట్వీట్లు మాత్రమే చేశారు కేటీఆర్.. మనోజ్ కున్న ఇంగితం, బాధ్యత తమరికి లేదా” అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు!

సాయిధరం తేజ్ ప్రమాధంపై ఉన్న శ్రద్ధ.. ఈ బాలిక కుటుంబంపై లేదని చెప్పిన మనోజ్ మాటలకు.. “సోకాల్డ్ మీడియాకు మనోజ్ మాటలు చెంపపెట్టు” అంటూ మరికొన్ని కామెంట్లు వెలువడుతున్నాయి.

-CH Raja