టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లు ఖరారు.. తెలంగాణ నుంచి?

అమరావతి : నూతన తిరుమల తిరుపతి దేవ స్థానం ( టీటీడీ ) పాలక మండలి ఖరారు అయింది. నూతన టీటీడీ పాలక మండలి పై ఒకటి లేదా మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు కూడా విడుదల కానున్నాయి. ఈ సారి 25 మంది రెగ్యులర్ సభ్యుల తో పాలక మండలి ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం.

ఇక ఇందు లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా చెవిరెడ్డి , భూమన, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్ కొనసాగనున్నారు.  ఇక ప్రత్యేక ఆహ్వానితులు గా 50 మంది కొనసాగనున్నారు. అటు తెలంగాణ రాష్ట్ర కోటా నుంచి ఏకంగా 10 మంది కి అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే…. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా పాలక మండలిలో చోటు కల్పించనుంది. విధాన నిర్ణయాల్లో ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి పాత్ర ఉండకుండా చర్యలు తీసుకుంటోంది.ఇక దీని పై రెండు రోజుల్లోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం.