నా పెళ్ళికి నన్ను కూడా పిలవండి..అంతా మీ ఇష్టం రా..పెళ్లిపై మనోజ్ ఫైర్..!

-

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పర్సనల్ కారణాల వల్ల తన భార్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం మంచు మనోజ్ సినిమాలకు కూడా కాస్త దూరమయ్యారు. ఫ్యామిలీ లైఫ్ లో డిస్టర్బ్ అవ్వడం వల్ల మనోజ్ సినిమాలకు దూరంగా ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే గత పది రోజుల నుండి మనోజ్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా కూడా అలాంటి వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. బంధువుల అమ్మాయిని మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నారు…త్వరలోనే పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి.manchu manoj at singareni

ఈ వార్తలపై తాజాగా మంచు వారబ్బాయి స్పందించాడు… దయచేసి నా పెళ్ళికి నన్ను కూడా పిలవండి అంటూ మనోజ్ చురకలు అంటించాడు. ఇంతకీ ఎవరా బుజ్జి పిల్ల.? తెల్ల పిల్ల పెళ్లి ఎక్కడ మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం. అంటూ మనోజ్ బ్రహ్మానందం ఫన్నీ ఫోటోను షేర్ చేశారు. ఇక మనోజ్ చేసిన ట్వీట్ తో పెళ్లి వార్తలు పుకార్లేనని తేలిపోయాయి. ఇదిలా ఉండగా మా ఎన్నికల నేపథ్యం లోనూ మనోజ్ సోషల్ మీడియాలో ఆర్జీవీ కి ఇలాంటి పంచ్ లే వేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news