నేడు తెలంగాణ రాష్ట్ర బంద్‌ !

-

మొన్న జరిగిన ఎన్‌ కౌంటర్‌ కు నిరసన గా తెలంగాణ మావోయిస్టు పార్టీ నేడు తెలంగాణ రాష్ట్ర బంద్‌ కు పిలుపు నిచ్చింది. ఈ మేరకు తెలంగాణ మావోయిస్టు పార్టీ ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్లవ కారులను హత్యలు చేస్తోందంటూ తీవ్ర స్థాయి లో మండిపడింది. అయితే.. ప్రతీ కార చర్య తో రగిలి పోతున్న మావోయిస్టులు ఏ క్ష ణం… ఎలాంటి చర్యలకు పాల్పడతారోనని మన్య ప్రాంతాలు వణికి పోతున్నాయి.

మరో వైపు ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు ఛత్తీస్‌ గడ్‌ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణ సరిహద్దు చిట్ట చివరి గ్రామమైన వాజేడు మండలం టేకుల గూడెం నుంచి చెరుకూరు వరకు తనీఖీలు చేపట్టారు. ఇప్పటికే… హిట్‌ లిస్ట్‌ లో ఉన్న నేతలను సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు ఏ క్షణమైనా దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు చెబుతున్నాయి. సరిహద్ద గ్రామాల్లో రెడ్‌ అలర్ట్‌ కూడా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news