‘ఏ జన్మ పుణ్యమో నాది.. లవ్ యూ అక్క’ – మంచు మనోజ్ ట్వీట్

-

భూమా మౌనికతో మంచు మనోజ్ వివాహం నిన్న వైభవంగా జరిగింది. ఈ క్రమంలో మెహందీ, హల్ది కార్యక్రమాల నుంచి పెళ్లి వరకు అన్నిటినీ మంచు లక్ష్మి దగ్గర ఉండి చూసుకున్నారు. దీంతో మంచు మనోజ్ ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

‘ఏ జన్మ పుణ్యమో నాది. లవ్ యు అక్క. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ అక్క’ అంటూ తనను పెళ్ళికొడుకుని చేస్తున్న ఫోటోను షేర్ చేశారు. కాగా, పెళ్లి వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

కాగా, గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్న మంచు మనోజ్ – మౌనిక రెడ్డి ఎట్టకేలకు రూమర్లకు తెరదించుతూ నిన్న రాత్రి ఫిలింనగర్ లో 8:30గంటల సమయంలో మంచు లక్ష్మి నివాసంలో వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. అయితే ఈ పెళ్లి మంచు మోహన్ బాబుకు ఇష్టం లేదని.. అందుకే మంచు మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు అంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారానికి బ్రేకులు వేస్తూ మోహన్ బాబు దంపతులు మంచు మనోజ్ – మౌనిక రెడ్డి పెళ్లిలో సందడి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news