ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి ఉరి శిక్షే కరెక్ట్ : మంచు మనోజ్ డిమాండ్

సింగరేణి కాలనీ ఆరేళ్ళ చిన్నారి కుటుంబాన్ని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు హీరో మంచు మనోజ్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన జరగడం చాలా దారుణం, దుర్మార్గమైన చర్య అని.. చిన్నప్పటి నుండే మహిళల పట్ల గౌరవం ఇచ్చేలా పిల్లలను పేరెంట్స్ పెంచాలని పేర్కొన్నారు.


నిరంతరం నేర్పిస్తూ ఉండాలని.. ఈ దారుణానికి పాల్పడ్డ రాక్షసులు ఎక్కడ ఉన్నాడో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంచు మనోజ్. పోలీసులు అతన్ని పట్టుకోవడాని కి శ్రమిస్తున్నారని.. అతనికి సంబంధించిన ఫోటోను అందరికీ చూపిస్తూ ఎక్కడ ఉన్నా పట్టుకొని పోలీసులకు అప్పగించాలని కోరారు మంచు మనోజ్. ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలి, ఊరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగ కుండా చూడాలని పేర్కొన్నారు మంచు మనోజ్.