Maa elections : విష్ణు కు మంచు మనోజ్ కౌంటర్.. వాట్ ఇస్ దిస్ అమ్మా !

-

మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు… ఈ రోజుతో ముగిశాయి. ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే… ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం కొనసాగిన సంగతి తెలిసిందే. వరుసగా ప్రెస్ మీట్ లు పెట్టుకొని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోస్తున్నారు ఇద్దరు సభ్యులు. ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటూ… మా ఎన్నికలను తారా స్థాయికి తీసుకువెళ్లారు.

రాజకీయ ఎన్నికల తరహాలో రెండు ప్యానెల్  సభ్యులు పోటీ పడ్డారు. అయితే ఇవాళ… మా అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ జరిగిన కేంద్రంలో… మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ సరదాగా ఓ సెల్ఫీ దిగారు. అయితే ఆ సెల్ఫీ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఆ ఫోటో ను మంచు విష్ణు తమ్ముడు మనోజ్… షేర్ చేశాడు.

” వాట్ అమ్మ… వాట్ ఇస్ దిస్ అమ్మా ” అంటూ ఆ ఫోటో క్యాప్షన్ పెట్టి మరీ షేర్ చేశాడు మంచు  మనోజ్. ఆ ఫోటో లో ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు పోలింగ్ కేంద్రం దగ్గర కలిసి హ్యాపీగా ఉన్న ఫోజ్ లో మనకు కనిపిస్తారు. ఈ ఫోటోను మంచు మనోజ్ షేర్ చేయడంతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరు వారిద్దరికీ పాజిటివ్ కామెంట్లు పెడుతూ ఉంటే… మరికొంత మంది నెటిజన్లు అయితే… సెటైర్లు పేలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news