కామ‌న్ పీజీ ప్ర‌వేశ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల‌.. ఇలా చెక్ చేసుకోండి !

-

తెలంగాణ రాష్ట్రంలోని కామన్ పిజి ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల అయ్యాయి. కామన్ పిజి ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. కామన్ పిజి ఎంట్రెన్స్ టెస్ట్ ల్లో 92.61 శాతం మంది అర్హత సాధించినట్లు ప్రకటన చేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 78 వేల 312 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. ఎంట్రెన్స్ టెస్ట్ లకు 68 వేల 836 మంది హాజరు అయినట్లు పేర్కొన్నారు. అయితే ఇందులో ఏకంగా 63 వేల 748 మంది క్వాలిఫై అయ్యరని స్పష్టం చేశారు.

ఆగస్ట్ మాసం 18 నుండి సెప్టెంబర్ 5 మధ్య ఈ ఎంట్రెన్స్ లు జరిగాయని.. ఉస్మానియా, కాకతీయ తెలంగాణ, శాతవాహన మహాత్మా గాంధీ, పాలమూరు, జె ఎన్ టి యు లలో పీజీ, పిజి డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ పిజి కోర్సుల్లో అడ్మిషన్స్ కొరకు ఈ పీజీ కామన్ ఎంట్రెన్స్ టెస్టులు జరిగాయని వెల్లడించారు. ఇక ఈ పరీక్ష లను ఓయూ నిర్వహించింది. osmania. ac. in, cpget.tsche.ac.in అనే అధికారిక వెబ్ సైటు లలో ఫలితాలు చూసుకోవచ్చని ఆయన చెప్పారు. ఇక ఈ అడ్మిషన్స్ కోసం… ఈ నెల 24 నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని… 27 నుండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news