MAA ELECTIONS : ‘మా’ ఎన్నికలు : మంచు విష్ణు సంచలన ప్రకటన

-

మా అధ్యక్ష ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఐదుగురు అభ్యర్థులు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు మాటల యుద్ధంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మా అధ్యక్ష ఎన్నికలపై హీరో మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన… మా అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం చేయాలని… పెద్దలందరూ ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు.

ఏకగ్రీవం చేయకపోతే మాత్రం పోటీలో తాను ఉంటానని స్పష్టం చేశారు మంచు విష్ణు. అంతేకాదు… మా అసోసియేషన్ భవనాన్ని తాను మరియు తన కుటుంబ సభ్యులను కట్టిస్తామని తెలిపారు. మద్రాస్ తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా తెలుగు సినీ నటీనటుల కష్టసుఖాలు తెలిసిన తెలుగువారు అధ్యక్షుడిగా ఉంటూ చాలా మంచి పనులు చేశారని తెలిపారు.  ఆ తర్వాత చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌ కు వచ్చిందని…  పెద్దలు అందరూ కలిసి ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేశారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news