అయ్య 50వేల ఉద్యోగాలంటే కొడుకు ఉద్యోగాల్లేవంటుండు : ష‌ర్మిల‌

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ఎన్ని విమ‌ర్శులు ఎదురైనా త‌న ప‌నితాను చేసుకుంటూ పోతున్నారు. ప్ర‌భుత్వం పై నేరుగా విమ‌ర్శ‌లు కురిపిస్తున్న ష‌ర్మిల ఇప్పుడు సోష‌ల్ మీడియాలోనూ కేసీఆర్ ప్ర‌భుత్వం పై విమర్శ‌లు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ష‌ర్మిల కేసీఆర్ పై మ‌రోసారి ట్విట్ట‌ర్ వేధిక‌గా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తండ్రి 50వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తం అంటాడని…అల్లుడు హరీష్ రావు 75 వేల ఉద్యోగాల భర్తీ అంటాడని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ఇక కొడుకు కేటీఆర్ ప్ర‌భుత్వ ఉద్యోగాలే లేవంటున్నాడ‌ని ష‌ర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Sharmila
Sharmila

ఒక్క ఇంటికే 5వేల ఉద్యోగాలు తీసుకున్నా మీకు నిరుద్యోగుల ప‌ట్ల భాద్య‌త ఉందా అంటూ ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ఉద్యోగాల కోసం చస్తున్న నిరుద్యోగులు కళ్ళెర్ర చెస్తే మీ ఉద్యోగాలు పోతాయంటూ ష‌ర్మిల కేసీఆర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా ష‌ర్మిల తెలంగాణా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి కూడా నిరుద్యోగుల ప‌క్షాన ఉంటూ పోటీ ధ‌ర్నాలు చేస్తున్నారు.