తెలంగాణ మంత్రిని కలిసిన మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన హీరో మంచు విష్ణు.. ఇవాళ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంచు విష్ణు… “మా” నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రిని ఆహ్వానించారు. ఈనెల 16వ తేదీన జరగబోయే మా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంచు విష్ణు కోరారు.

అయితే దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తాను తప్పకుండా వస్తాం అని మంచు విష్ణుకు హామీ ఇచ్చారు. ఇక మంచు విష్ణు తో పాటు ట్రెజరర్ గా నూతనంగా గెలిచిన శివ బాలాజీ కూడా ఉన్నారు. ఇక అంతకు ముందు.. నందమూరి బాలకృష్ణ ను మంచు విష్ణు మరియు డైలాగ్ కింగ్ మోహన్ బాబు… మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. కాగా .. అక్టోబర్ 10వ తేదీన జరిగిన మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ పై మంచు విష్ణు ప్యానల్ సభ్యులు భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.