కత్తి మహేష్ మృతి : మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు

సినీ విమ‌ర్శకుడు, న‌టుడు అయిన క‌త్తి మ‌హేశ్‌ మూడు రోజుల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత నెల 26న తన సొంతూరుకు వెళ్ళే నేపథ్యంలో యాక్సిడెంట్ అయింది. అయితే.. ఈ యాక్సిడెంట్ లో తలకు బలమైన గాయాలతో ఆస్పత్రి పాలైన కత్తి మహేష్.. శనివారం సాయంత్రం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇది ఇలా ఉండగా క‌త్తి మ‌హేశ్‌ మృతిపై మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కత్తి మహేష్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు మందకృష్ణ మాదిగ. కారులో ముందు సీట్లో కూర్చున్న కత్తి మహేష్ చనిపోయాడని… అదే కారులో కత్తి మహేష్ పక్కన కూర్చున్న వ్యక్తికి చిన్న గాయం కూడా కాలేదని పేర్కొన్నారు. కత్తి మహేష్ కూర్చున్న వైపే కారు డ్యామేజ్ కావడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు మందకృష్ణ.

మహేష్ కి ఎంతో మంది శత్రువులు ఉన్నారని తెలిపిన మందకృష్ణ.. ఆక్సిడెంట్ అయ్యాక కత్తి మహేష్ కు అసలు గాయాలే కాలేదన్నారు. ఆసుపత్రిలో మహేష్ ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు పెడుతున్నారు అని మండిపడ్డారు. కత్తి మహేష్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మందకృష్ణ.