ఎస్సీ వర్గీకరణ పోరు కీలక దశకు చేరుకుంది : మంద కృష్ణ

-

ఎస్సీ వర్గీకరణ పోరాటం కీలక దశకు చేరుకుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినేత మంద కృష్ణ మాదిగ అన్నారు. శనివారం ప్రజ్ఞాపూర్‌లో నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నవంబర్ 18న హైదరాబాద్‌లోని పరేడ్ మైదానంలో లక్షలాదిమందితో మాదిగల విశ్వరూప మహాసభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

Manda Krishna Madiga asks central govt to legitimise SC categorisation |  Visakhapatnam News - Times of India

కేసీఆర్ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మాకు అన్యాయం చేసిన పార్టీలను మాదిగ పల్లెల్లోకి రాకుండా చేస్తామని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే తరాలకు రాబోయే వందల సంవత్సరాలకు మంచి జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీల వైఖరి వెల్లడించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకునే పార్టీకే మాదిగల మద్దతు ఉంటుందన్నారు. పార్టీలకు అతీతంగా దళితులందరూ హైదరాబాద్‌లో జరిగే మహాసభకు హాజరుకావాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news