రెహమాన్ కు షాక్ ఇచ్చిన శంకర్

-

సౌత్ లో క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన శంకర్ 2.ఓతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని చెప్పాలి. ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ తో ఇండియన్ సినిమా సీక్వల్ చేస్తున్నాడు. ఇండియన్ 2 టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే మొదలైంది. లైకా ప్రొడక్షన్స్ లో 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియన్ 2 నిర్మించబడుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుద్ రవిచందర్ లక్కీ ఛాన్స్ అందుకున్నాడు.

శంకర్ సినిమా అంటే కచ్చితంగా అది రెహమాన్ మ్యూజిక్ అనే టాక్ ఉండేది. శంకర్ తను చేసిన ఇన్ని సినిమాల్లో కేవలం అపరిచితుడు, స్నేహితుడు సినిమాలకు రెహమాన్ బదులు హారిస్ జైరాజ్ ను తీసుకున్నాడు. 2.ఓ సినిమా రెహమాన్ ఆశించిన మ్యూజిక్ ఇవ్వలేదని అందువల్లే ఇండియన్ 2కి రెహమాన్ ప్లేస్ లో అనిరుద్ రవిచందర్ ను సెలెక్ట్ చేశాడట. మరి శంకర్, అనిరుద్ కాంబినేషన్ ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version